04-05-2025 01:07:29 AM
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): పేదలకు ఇందిరమ్మ ఇంటి పథకం కింద రూ.5 లక్షల సాయం చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాదిలో 4.50 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నామని స్పష్టంచేశారు.
పేద లు ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పం తో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం ఇంది ర మ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టిందని, ఏడాదికి రూ.22 వేల కోట్లు ఖర్చు చేస్తా మని చెప్పారు. ఇప్పటికే పైలట్ గ్రా మాల్లో ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సా గుతున్నాయన్నారు. హౌసింగ్ కార్పొరేష న్‌లో ఔట్‌సోర్సింగ్‌లో నియామకమైన 350 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం సర్టిఫికెట్లు అందజేశారు.
ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 350 మంది అసిస్టెంట్ ఇంజినీ ర్లకు న్యాక్‌లో ఆరు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆలోచన లకు అనుగుణంగా, అవినీతికి ఆస్కా రం లేకుండా నిజాయతీ, నిబద్ధతతో పని చేయాలని కోరారు.
పేదోడి చిరకాల కోరికను నెరవేరుస్తున్న ఇందిర మ్మ ఇళ్ల పథకంలో అసిస్టెంట్ ఇంజినీర్లు భాగస్వాములు కావాలని మంత్రి సూచించారు. ఎంపికైన 350 మంది ఇంజినీర్లలో 45 శాతం మహిళలు ఉండటం సంతోషకరమని చెప్పారు. ఇంజినీర్ల ఎంపిక విషయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, మెరిట్ ఆధారంగానే ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షే మం పథకం కింద ఒక లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇస్తున్న పథకం ఏదీ లేదన్నారు. ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఇస్తు న్న నిధులతోనే అన్ని రాష్ట్రాలు సరి పెడుతున్నాయని, తెలంగాణలో మాత్రం పేదల సంక్షేమా న్ని దృష్టిలో పెట్టుకొని రూ.5 లక్షలతో 400 నుంచి 600 చదర పు అడుగుల మధ్య ఇం టిని నిర్మించుకునేలా పథకాన్ని రూపొందించినట్టు మంత్రి పొం గులేటి వివరించారు.
పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రతీ మం డంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టా మని, అయితే కొన్ని ప్రాంతాల్లో పరిమిత స్థలాన్ని దాటి ఇళ్లు నిర్మించుకున్నారని, అలాం టి వాటికి బిల్లులు హోల్డ్ లో పెట్టినట్టు తెలిపారు. అయితే వీటిని పడగొట్టడం కంటే బేస్‌మెంట్ పూర్తయిన ఇళ్లకు ఈసారికి మినహాయింపు ఇచ్చి రూ.లక్ష విడుదల చేస్తామని పేర్కొన్నారు.
4 లక్షల మందితో జాబితా
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సం బందించి 4 లక్షల మందితో జాబితాను త్వరలోనే ఫైనల్ చేయబోతున్నామని, విధుల్లో చేరిన వెంటనే జాబితాలపై అసిస్టెంట్ ఇంజినీర్లు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా అ ర్హులకే ఇళ్లు లభించేలా క్షేత్రస్థాయిలో పని చేయాలని, మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుం డా చూడాలన్నారు.
వివిధ దశ ల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ప్రతీ సో మవారం చెల్లింపులు చేస్తున్నామని మంత్రి వివరించారు. నిర్మాణ రంగంలో తనకున్న అనుభవంతో తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించడానికి అధికారులకు పలు సూచనలు చేశానని, యు వ ఇంజినీర్లు ఈ అంశాలపై దృష్టి సారించి, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.
సర్టిఫికెట్ల అందజేత
స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభు త్వం పదోన్నతులు కల్పించింది. వీరికి మంత్రి పొంగు లేటి పదోన్నతి సర్టిఫికెట్లు అందజేశారు. గ్రేడ్-2లో పని చేస్తున్న 10 మందికి సబ్‌రిజిస్ట్రార్లుగా గ్రేడ్ -1కి, సీనియర్ సహాయకులుగా పని చేస్తున్న 11 మందికి గ్రేడ్-2 పదోన్నతులు కల్పించారు.