8 August, 2026 | 1:15 AM

కొంపల్లి అభివృద్ధికి కృషి చేస్తున్నాం..

08-08-2026 12:00 AM

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 (విజయక్రాం తి): మౌలిక వసతుల కల్పనతో కొంపల్లి అ భివృద్ధికి కృషి చేస్తున్నామని బిఆర్‌ఎస్ ఎ ల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పేర్కొ న్నారు. సీఎంసీ కొంపల్లి సర్కిల్ పరిధి ఉమా మహేశ్వర కాలనీలో బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సంద ర్బంగా కాలనీలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని  కాలనీవాసులు ఎమ్మె ల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు  అధికం గా నివసించే  ఈ ఉమామహేశ్వర  కాలనీ లో గత 12 ఏళ్ల కాలంలో ప్రజల జీవన ప్ర మాణాల పెంపుకై అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.

మౌలిక వసతుల క ల్పనలో భాగంగా భూగర్భ డ్రైనేజీ నిర్మాణం తోపాటు సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెం టనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో కూడా ఉమామహేశ్వర కా లనీలో అన్ని మౌలిక వసతులతో కాలనీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చే స్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి సర్కిల్ ఉప కమిషనర్  లావణ్య, డీఈలు సామ్రాట్, తిరుపతి, శ్రీశైలం యాదవ్, మాజీ ఎంపీపీ కవిత, ప్రభాకర్ రెడ్డి, వినోద్, సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.