27 May, 2026 | 2:03 AM

కంకణ బద్ధులమై అభివృద్ధి చేస్తున్నాం

27-05-2026 12:23 AM

ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

మహమ్మాదాబాద్ మే 26: కంకణ బద్ధులమై అభివృద్ధి చేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చౌదర్పల్లి పెద్దతండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో, నంచర్ల గేటు నుంచి చులపల్లి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, ముందలి తండాలో ఇందిరమ్మ గృహప్రవేశం, మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్   65 మంది లధిదారులకుచెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పక్క ప్రణాళికలతో అభివృద్ధి చేస్తున్నామని, ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నమని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని విడుదల వారీగా ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతుందని సూచించారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ నేతలు, అధికారులు ఉన్నారు.