27 May, 2026 | 1:23 AM

అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

27-05-2026 12:25 AM

శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ 

మంచిర్యాల, మే 26 (విజయక్రాంతి): తెలంగాణ అవతరణ వేడుకలు సింగరేణిలో ఘనంగా నిర్వహించాలని శ్రీరాంపూర్ ఏరి యా జీఎం మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళ వారం జీఎం కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు - 2026 నిర్వహణపై శ్రీరాంపూర్ ఏరియా అన్ని విభాగాల అధిపతులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సన్నాహాక సమీక్షా సమావేశంలో జీ ఎం మాట్లాడారు. దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటం సిద్దించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2 న అధికా రికంగా రాష్ట్ర అవతరణ వేడుకలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందనీ, సింగరేణి వ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయిం చిందన్నారు.

ఎప్పటిలాగే ఈసారి కూడా ఘనంగా తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రెషన్స్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం నస్పూర్ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభించి బతుకమ్మలు, పీరిల ఊరేగింపు, ఓగ్గుడోలు పోతరాజుల నృత్యాలతో సింగరేణి అధికారులు, ఉద్యోగులు ఆటపాటలతో సింగరేణి ఉద్యోగుల నివాస ప్రాంగాణాల గుండా జీఎం కార్యాలయానికి చేరుకొని జీఎం కార్యాలయం ఎదుట ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు తెలిపేలా పకబ్బందీ ఏర్పాట్లు జరగాలని సూచించారు.

అనంతరం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ప్రాంగణంలోని ప్రోఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలపన కార్యక్రమాలు నిర్వహించనున్నామ న్నారు. అదే రోజు సాయంత్రం ప్రగతి స్టేడియంలో నిర్వహించే వేడుకలకు పెద్ద ఎత్తున వచ్చే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆకట్టుకునేలా స్టాల్స్ ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టూ జీఎం సత్యనారయణ, సీఎంఓఏఐ శ్రీరాంపూర్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, ఏజీఎం(ఈ అండ్ ఎం) రమణ రావు, డీజీఎం(సివిల్) ఆనంద్ కుమార్, డీజీఎం(పర్సనల్) అనిల్ కుమార్, డీజీఎం(ఫారెస్ట్) హరినారాయణ, ఎస్టేట్ (మేనేజర్) వరలక్ష్మి, డీవై పీఎం కిరణ్, సీనియర్ పీఓ సురేందర్, అన్ని గనుల ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఏజెంట్లు, మేనేజర్లు, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.