17-07-2025 01:31:51 AM
- సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
- స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలి
- ఢిల్లీలో స్వదేశీకరణ వర్క్‌షాప్‌కు హాజరు
న్యూఢిల్లీ, జూలై 16: భారత్ తన రక్షణ సామర్థ్యాలను తక్షణమే ఆధునీకరించాల్సిన అవసరముందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. నిన్నటి ఆయుధాలతో యుద్ధం చేసి గెలవలేమని.. రేపటి టెక్నాలజీని ఉపయోగించి ఇ వాళ యుద్ధం చేయాల్సి ఉంటుందని వ్యా ఖ్యానించారు.
బుధవారం ఢిల్లీలో జరిగిన యూఏవీ, కౌంటర్ ఏరియల్ సిస్టమ్స్ (సి స్వదేశీకరణ వర్క్‌షాప్‌కు అనిల్ చౌహాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ్టి అధునాతన యుద్ధంలో అత్యాధునిక సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పా రు. నిన్నటి ఆయుధాలతో ఇవాళ యుద్ధం లో గెలవలేమన్నారు.
మన వ్యూహాత్మక మి షన్లకు కీలకమైన సాంకేతిక కోసం విదేశాల పై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించా రు. దిగుమతి చేసుకున్న టెక్నాలజీపై ఆధారపడితే మన సంసిద్ధత దెబ్బతింటుదన్నారు. అందువల్ల స్వదేశీ సాంకేతికతను త్వరితగతని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉం టుందని చెప్పారు. మేలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి నిరాయుధ డ్రో న్లు, మందుగుండు సామగ్రిని పెద్ద ఎత్తున మోహరించిందన్నారు.
దాదాపు అన్నింటినీ సమర్థవంతంగా నిర్వీర్యం చేశామని అనిల్ తెలిపారు. యూఏవీ వల్ల భారత సైన్యానికి కానీ, సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని వివరించారు. ఆపరేషన్ సిందూ ర్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్ గురిం చి అ నిల్ చౌహాన్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశా రు. పాకిస్థాన్ సొంత రక్షణ వ్యవస్థలు బలం గా లేకపోవడంతో చైనాపై ఆధారపడిందని.. భారత్ మాత్రం ఆకాశ్ వంటి స్వదేశీ వ్యవస్థలనే ఉపయోగించిందని వెల్లడించిన సంగతి తెలిసిందే.