17-07-2025 01:28:02 AM
- సైనిక ప్రధాన కార్యాలయమే లక్ష్యంగా
డమాస్కస్, జూలై 16: ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఘర ణ వాతావరణం నెలకొంది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చూసింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్ వెల్లడించింది. అలా గే రక్షణశాఖ కార్యాలయాన్ని లక్ష్యం గా చేసుకుందని సిరియన్ సైనిక వర్గాలు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించాయి.
మరోవైపు సిరియాలోని అధికారిక మీడియా కేంద్రం ఉన్న భవనంపై దాడులు జరిగాయి. లైవ్ కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దాడులతో ఉలిక్కిపడిన మహిళా యాం కర్ అక్కడి నుంచి పరిగెత్తడం కనిపించింది. సిరియాలో స్వెయిదా ప్రాం తంలో స్థానిక మిలీషియాల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో 100 మంది ప్రాణాలు కోల్పోయా రు. మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలీషియాకు, సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య ఆదివారం సాయుధ ఘర్షణ ప్రారంభమైంది.