17-07-2025 01:34:22 AM
నిర్ణయంపై పునరాలోచన చేయాలని భారత్ సూచన
ఢాకా, జూలై 16: ప్రఖ్యాత చిత్ర దర్శకుడు సత్యజిత్ రేకు చెందిన పూర్వీకుల ఇల్ల్లు బం గ్లాదేశ్‌లో ఉంది. అయితే ఆ ఇంటిని కూల్చేం దుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఇప్పటికే కొంత వరకు కూల్చివేత ప్రారం భమైనట్టు తెలుస్తోంది. కాగా ఢాకాలోని మైమేన్‌సింగ్‌లో సత్యజిత్ రే పూర్వీకుల ఇల్ల్లు ఉంది.
అయితే సత్యజిత్ రే పూర్వీకుల ఇల్లు కూల్చివేతపై భారత్ ప్రభుత్వం స్పందిం చింది. కూల్చివేత నిర్ణయంపై పునరాలోచన చేయాలని బంగ్లా ప్రభుత్వానికి భారత్ సూచించింది. పురాతన భవంతి కావడంతో బంగ్లా సంస్కృతికి చిహ్నంగా, సాహిత్య మ్యూజియంగా ఆ నిర్మాణాన్ని చూడాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరింది. సత్యజిత్ రే తా త, ప్రఖ్యాత సాహిత్యకారుడు ఉపేంద్ర కిషో ర్ రే చౌదరీకి చెందిన ఇల్లు ఢాకాలో ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ గతంలో తెలిపింది.
బంగ్లాదేశ్ ఆర్కియాలజీ శాఖ ప్రకారం ఆ ఇంటిని సుమారు వందేళ్ల క్రితమే నిర్మిం చారు. గత పదేళ్ల నుంచి ఆ ఇళ్లు నిర్మాను ష్యంగా ఉంటుంది. శిశు అకాడమీ కార్యక్ర మాలు ఒక కిరాయి ఇంటి నుంచి సాగుతు న్నాయి. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే కూల్చివేత ప్రక్రియ మొదలు పెట్టినట్టు ప్రభుత్వ అధికారి తెలిపారు. సత్యజిత్ రే పూర్వీకుల ఇల్లు కూల్చడంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు.