calender_icon.png 6 September, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

06-09-2025 12:44:21 AM

  1. రాజీవ్ సాగర్, మఠం భిక్షపతి బహిరంగ క్షమాపణ చెప్పాలి 
  2. తెలంగాణ జాగృతి నాయకులు 

ఖైరతాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, మఠం భిక్షపతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జాగృతి నేతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జాగృతి నాయకులు లింగం, వరలక్ష్మి డేవిడ్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు..తెలంగాణ జాగృతి మాది అంటున్నా రాజీవ్ సాగర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని దీనిపై అతను ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు.

జాగృతి అధ్యక్షురాలు కవిత వల్లే రాజీవ్ సాగర్ ,మఠం భిక్షపతి కార్పొరేషన్ చైర్మన్‌లు అయ్యారని అన్నారు. రబ్బర్ చెప్పులు వేసుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం కోట్లకు  పడగెత్తి అన్నం పెట్టిన చేతిని నరికివేయాలని చూస్తున్నారని విమర్శించారు .రాజీవ్ సాగర్, మఠం బిక్షపతి ల మాటల వెనుక మాజీ మంత్రి హరీష్‌రావు ఉన్నారని అన్నారు. తీన్మార్ మల్లన్న అధ్యక్షురాలు కవితపై వ్యాఖ్యలు చేస్తే మీరు ఎక్కడికి పోయా రని ప్రశ్నించారు. అధ్యక్షురాలు కవితపై  చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.