calender_icon.png 6 September, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింఛన్లు పెంచాలని కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి

06-09-2025 12:49:47 AM

ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు గండి కృష్ణ మాదిగ

ముషీరాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి) వృద్ధులు, వితంతువులు, దివ్యాంగు లు, ఒంటరి మహిళలకు పింఛన్ పెంచేందుకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాం డ్ చేస్తూ ఈ నెల 8న నిర్వహించే జిల్లా కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్  జాతీయ నాయకుడు గండి కృష్ణ మాదిగ కోరారు.

శుక్రవారం మోహన్ నగర్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి విహెచ్పిఎస్, సీహెచ్ పీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

న్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పెన్షన్ డబ్బులు పెంచుతామని హామీ ఇచ్చి 21 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు చేయూత, ఆసరా పెన్షన్లు పెంచలేదని ఆరోపించారు. ఈ సమావేశం లో  ఎమ్మార్పీఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి గజ్జల రాజశేఖర్, నాయకులు ఎల్లయ్య, నర్సింగ్ రావు, మధు పాల్గొన్నారు.