18 April, 2026 | 3:09 AM

నల్ల బిల్లును ఓడించాం

18-04-2026 01:43 AM
  1. రాహుల్, ఖర్గే నేతృత్వంలో జాతీయ విపత్తును అడ్డుకున్నాం 

ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ 

హైదరాబాద్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయ విపత్తను నివారించిన రోజని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్షాలు కలిసి జాతీయ విపత్తును నివారించాయని, రాహుల్‌గాంధీ, ఖర్గే నేతృత్వం లో ఈ విపత్తును అడ్డుకున్నారు. దేశ చరిత్రలో సువర్ణదినంగా ఈ రోజు గుర్తుండి పోతుంది.

నల్ల బిల్లులను ఓడించేందుకు కఠిన పరిస్థితుల్లోనూ ఐకమత్యంతో, సాహాసంతో నిలిచిన మిత్రపక్షాల నాయకులు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్‌యాదవ్, శరద్‌పవార్, ఉద్దవ్‌ఠాక్రే, లాలుప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫరూఖ్ అబ్దు ల్లా, నవీన్ పట్నాయక్‌చ అరవింద్ కేజ్రీవాల్, కమ్యునిష్టు పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తిని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కా పాడటంలో ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ‘మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు కేంద్రం పన్నిన డీలిమిటేషన్ కుట్రను ప్రజాస్వామ్య శక్తులు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఇది కేవలం ఒక బిల్లు వీగిపో వడం కాదు. సమాఖ్య స్ఫూర్తికి దక్కిన విజ యం’ అని సీఎం రేంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మ హిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే వాటిని డీలిమిటేషన్, కులగణనతో ముడిపెట్టి కాలయాపన చేయడాన్ని అంగీకరించబోమని సీఎం స్పష్టం చేశారు. విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఐక్యంగా నిలబడి, తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడారని ఆయన కొనియాడారు.