2 September, 2026 | 8:53 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

పెద్ద యజ్ఞమే చేశాం

14-07-2024 | 01:08am

ప్రదీప్‌రెడ్డి, శివ నాయుడు, గోవా జ్యోతి నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా ‘యజ్ఞ’. సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, చిట్టిబాబు, చెన్నకేశవ నాయడు, ఆవిష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్ కామెడీ కథతో దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆర్‌ఆర్ మూవీ క్రియేషన్స్, రేణుకా ఎల్లమ్మ ఫిల్మ్స్ పతాకాలపై చిలుకోటి రఘురాం, చీలపల్లి విఠల్ గౌడ్  నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ.. “యజ్ఞ’ సినిమాను తెరకెక్కించేందుకు పెద్ద యజ్ఞమే చేశాం.

తొలుత అనుకున్న ప్రొడ్యూసర్ షూటింగ్ టైమ్‌కు ప్రాజెక్టు నుంచి తప్పుకోగా నా స్నేహితుడు రఘురాం, విఠల్ గారు, సుభాష్ రావు గారు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. గతేడాదే విడుదల కావాల్సిన ఈ సినిమాను ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ కంప్లీట్ చేశాం” అని చెప్పారు. కార్యక్రమంలో ఈ చిత్ర నిర్మాత, హీరో, హీరోయిన్‌తోపాటు సమర్పకుడు సుభాష్ రావు, మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మణసాయి మాట్లాడారు. అతిథులుగా హాజరైన నిర్మాతలు ఆర్కే గౌడ్, లయన్ సాయివెంకట్, బసిరెడ్డి కూడా ప్రసంగించి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.