6 July, 2026 | 3:08 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ఆ వయసు వరకే..

14-07-2024 01:22 AM

2019లో వచ్చిన తమిళ చిత్రం ‘బోదై యేరి బుద్ధి మారి’తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది దుషారా విజయన్. ప్రస్తుతం రజనీకాంత్ ‘వెట్టయన్’తోపాడు ధనుష్ కథానాయకుడిగా వస్తున్న ‘రాయన్’ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించనుంది. అంతేకాకుండా ‘వీర ధీర శూరన్’లో విక్రమ్ సరసన నటిస్తోంది. నటనపై ఆసక్తితోనే చిత్రసీమకు వచ్చానని అరంగేట్రం సమయంలో చెప్పింది. అయితే, పూర్తి స్థాయి జీవితం సినిమాల్లోనే గడపననేది ఈ చిన్నది తాజాగా చెప్తున్న మాట. హీరోయిన్లు అందం, అభినయం, ప్రతిభను ప్రదర్శిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగపర్చుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతుంటారు.

నటనపై ఎలాంటి విమర్శలూ రావటంలేదు.. అందాల ఆరబోతకూ వెనుకాడేది లేదనీ చెప్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. “నేను ‘రాయన్’ చిత్రంలో నటించడం సాధనగా భావిస్తున్నాను. నేను ధనుష్‌కు వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించాలన్నది నా చిరకాల కోరిక. అది ‘రాయన్’తో నెరవేరింది. దీంట్లో నేను నార్త్ చెన్నై యువతిగా కనిస్తాను” అని తెలిపింది. ఇంకా చెప్తూ.. ‘నేను 35 ఏళ్ల వయసు తర్వాత నటనకు గుడ్‌బై చెప్తాను. అనంతరం విదేశీయానం చేస్తాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సొగసరి వయసు సరిగ్గా 26 ఏళ్లు. అంటే తొమ్మిదేళ్లు నటిస్తుందన్న మాట ఈ చిన్నది. వచ్చే ‘నవ’ వసంతాల్లో నవ రసాలు పండించే అవకాశాలు దుషారా ముందుకు మోసుకు రావాలని కాలానికి ఇషారా చేయండి. 

‘అలనాటి రామచంద్రుడు’ రాకకు ఖాయమైన తేదీ

చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. ‘అలనాటి రామచంద్రుడు’ పేరుతో వస్తున్న ఈ సినిమాను హైనివా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. కృష్ణవంశీ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయనతో కథానాయికగా మోక్ష జతకడుతోంది. ఇంకా ఈ మూవీలో సీనియర్ నటులు బ్రహ్మాజీ, సుధతోపాటు ప్రమోదిని, వెంకటేశ్ కాకమును, చైతన్య గరికిపాటి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే పాటలు, టీజర్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర దర్శక నిర్మాతలు శనివారం వెల్లడించారు. ఈ సినిమాకు సంగీతం: శశాంక్ తిరుపతి; డీవోపీ: ప్రేమ్‌సాగర్; సాహిత్యం: చంద్రబోస్, రాకేందు మౌళి, శ్రేష్ట, భరద్వాజ్ గాలి, డా. జీ సుమతి; స్టంట్స్: వింగ్ చున్ అంజి.