మా తండాలో ఐటి పార్క్ వద్దు
ప్రభుత్వానికి ఆలిండియా బంజారా సేవ సంఘ్ విజ్ఞప్తి
ముషీరాబాద్, మే 12 (విజయక్రాంతి) : గోపన్ పల్లి తండాలో ఐటీ పార్క్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమిం చుకోవాలని ఆలిండియా బంజారా సేవ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఎస్.రాజు నాయ క్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలిండియా ట్రైబ ల్ జేఏసీ చైర్మన్ రవీంద్ర నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మ నాయక్, హైకోర్టు అడ్వొకేట్ శ్రీనివాస్ రావుతో కలిసి ఆయన మాట్లాడారు.
శేరిలింగంపల్లి మం డలం గోపన్ పల్లి తండా పరిసరాల్లో 440 ఎకరాల్లో ప్రభుత్వం ఐటీ పార్కు ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించడంతో గోపన్ పల్లి తం డా లాంబడీ, గిరిజనులలో ఆందోళన, భ యం నెలకొందని తెలిపారు. దాదాపు 400 ఏళ్ల నుండి తమ పూర్వీకులు ఇక్కడి కొండ కోనల్లో నివసిస్తూ, పశు పోషణ, వ్యవసా యం చేస్తుకుంటూ జీవనం కొనసాగించి, తమకు వారసత్వంగా ఈ భూములు ఇచ్చారని వివరించారు.
ఇప్పటి తండా వాసులు ఆ భూముల్లో వరి, కూరగాయలు, ఆహార పంటలు పండించుకొని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ భూములకు ప్రభు త్వం పట్టా పాసు బుక్కులు కూడా జారీ చేసిందని పేర్కొన్నారు. ఒకనాడు ఎలాంటి విలువ లేని భూములు, నేడు హైదరాబాద్ నగరం విస్తరించడంతో ఆ భూములకు రెక్కలొచ్చి ఎకరం కోట్లు పాలకడంతో పలు కార్పొరేట్ కంపెనీల దృష్టి ఈ భూములపై పడిందని ఆరోపించారు.
ఐటీ పార్కు కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను సర్వే చేసి భూ ములు సేకరించి పనులు ప్రారంభించాలని, ప్రభుత్వం ఆదేశించడం పట్ల తండా వాసు లు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరుపేదల లంబాడా ప్రజల భూముల జోలికి రావొద్దని వేడుకున్నారు.
మొండిగా ముం దుకు వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాలతో పాటు రాజకీయ పార్టీల సహకారంతో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘ్ నేతలు కిషన్, గోడి నాయక్, హనుమంతు, పాండు, రాంచందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.






