calender_icon.png 13 May, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి కూలీలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

12-05-2025 11:20:46 PM

ఎంపీడీవో రాజేశ్వర్

మందమర్రి,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ  ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ పరివర్తన,  నిషా ముక్త్ భారత్ అభియాన్ లో బాగంగా మత్తు పదార్థాలపై ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామీణులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడు కోవాలన్నారు. గంజాయి వంటి వాటికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులలో చేపట్టిన రోడ్డు పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరీష్, ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య ఉపాధి కూలీలు పాల్గొన్నారు.