calender_icon.png 13 May, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనవాడకు నిధులు కేటాయించాలి

13-05-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే12 (విజయక్రాంతి): వాంకిడి మండలం కిరిడి గ్రామం లోని గిరిజనవాడ అభివృద్ధికి ప్రత్యేక నిధు లు కేటాయించాలని సోమవారం అదనపు కలెక్టర్‌కు డీవైఎఫ్‌ఐ, టీఏజీఎస్, కేవీపీఎస్ ఆధ్వర్యం లో వినతిపత్రం అందజేశారు. ప్రజా సంఘా ల నాయకులు మాట్లాడుతూ ఎస్టీ వాడ ఏర్పా టు జరిగి ఏండ్లు గడుస్తున్న అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు.

సీసీ రోడ్డు, మురికి కాలువలు లేకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు టీకానంద్, కార్తీక్, కేవీపీఎస్ కార్యదర్శి దినకర్, టీఏజీఎస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామస్తులు లక్ష్మీ, విమల, చంద్రకళ, శంకర్, కళాబాయి, భారతి తదితరులు పాల్గొన్నారు.