18 June, 2026 | 4:13 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్ లను పంపిణీ చేశాం: ఎంఈఓ

18-06-2026 02:54 PM

బోథ్ . జూన్ 18 (విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను నోట్ బుక్కులను సరఫరా చేయడం జరిగిందని మండల విద్యాధికారి మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. రెండో విడత లో సోనాల మండలానికి పంపిణీ చేస్తున్నామని వివరించారు. పాఠశాలకు పుస్తకాలను తీసుకువెళ్లిన ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించాలని సూచించారు. మండలంలోని మర్లపల్లి కుచులాపూర్ దన్నూర్ గ్రామాల తో పాటు బోత్ బాలికలు ఉర్దూ పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరయ్యాయని తెలిపారు. అందులో వాలంటీర్ల నియామకం త్వరలో పూర్తవుతుందన్నారు. నాలుగు సంవత్సరాలు నిన్న విద్యార్థిని విద్యార్థులను ఫ్రీ ప్రైమరీ పాఠశాలల్లో తప్పనిసరిగా చేర్పించాలన్నారు. ప్రాథమిక పాఠశాలలను మరింత పటిష్ట పరచాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఫ్రీ ప్రైమరీ పాఠశాలలను మంజూరు చేసింది అన్నారు.