భారత్‌పై మాదే పైచేయి
- ఎలా గెలవాలో మాకు తెలుసు
- శ్రీలంక కెప్టెన్ వార్నింగ్
గాలే , ఆగస్టు 13 : భారత్‌తో తొలి టెస్టు కు ముందు శ్రీలంక జట్టు కెప్టెన్ ధనంజయ డి సిల్వ మైండ్ గేమ్స్ మొదలుపెట్టాడు. భారత్‌ను ఎలా ఓడించాలో తమకు తెలుసన్నాడు. కీలక బ్యాటర్ల కోసం తమ వ్యూహా లు సిద్ధంగా ఉన్నాయంటూ వార్నింగ్ ఇ చ్చాడు. గాలే వేదికగా జరిగే తొలి టెస్టుకు ముందే లంక సారథి స్పందిస్తూ, తమకు సొంతగడ్డపై ఉన్న ఘనమైన రికార్డులే తమ ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతు ల్లో టెస్టు సిరీస్‌లు ఓడిపోయిన భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఈ పరిస్థితుల్లో గాలేలోని టర్నింగ్ వికెట్లపై టీమిండియాను ఎదుర్కోవడం తమకు మరింత సులువవుతుందని హెచ్చరించాడు.
భారత బ్యాటర్లను క్రీజులో ఎక్కువ సమయం ఉండనీయకుండా పరుగులు కట్టడి చేయడమే తమ ప్రధాన వ్యూ హమన్నాడు. మ్యాచ్‌ను 4 లేదా 5వ రోజు వరకు తీసుకెళ్లగలిగితే ఒత్తిడి పెరిగి భారత్ పరాజయం పాలవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. గిల్ సారథ్యంలోని ఈ భారత జట్టు లో అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ మాత్ర మే తమకు అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని, శ్రీలంక పరిస్థితులపై అతనికి పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నాడు.
అలాగని తాము భారత్‌ను తక్కువ అంచనా వేయడం లేదన్నాడు. భారత్ గత సిరీస్‌లలో వైట్‌వాష్ అయినప్పటికీ, వారు స్పిన్ ఆడటం పూర్తిగా మర్చిపోలేదని, పుంజుకోవడానికి ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించాడు. భారత బ్యాటర్లను క్రీజులో ఎక్కువ సమయం ఉండనీయకుం డా పరుగులు కట్టడి చేయడమే తమ ప్ర ధాన వ్యూహమని లంక సారథి స్పష్టం చేశాడు. గాలే పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు స్వర్గధామం అయినప్పటికీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల తేమ పెరిగి తొలి రెండు, మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాత నుంచి స్పిన్ తిరగడం మొదలవుతుందన్నాడు.






