14 August, 2026 | 3:26 AM

ఆసియా క్రీడల్లో భారత్, పాక్ పతక పోరు

14-08-2026 12:00 AM

ముంబై , ఆగస్టు 13: ప్రపంచ క్రికెట్‌లో పెద్ద టోర్నీ జరిగిన ప్రతీసారీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పైనే అందరికీ ఆసక్తి ఉంటుంది.   ఆసియా క్రీడల్లోనూ క్రికెట్ ఉండడంతో భా రత్, పాక్ మ్యాచ్‌పైనే ఆసక్తి నెలకొంది. ఈ సారి జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో భా రత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గ్రూప్ దశ లే దా ప్రారంభ మ్యాచ్‌లో ఉండదు.డ్రామేరకు ఇరు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉండడంతో, పతకాల పోరులో మాత్రమే ఈ దాయాదు ల సమరం సాధ్యమవుతుంది.

భారత్, పాకిస్తాన్ రెండు జట్లూ తమ తమ సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్ చేరితే బంగారు పతకం కోసం తలపడతాయి.ఒకవేళ ఇరు జట్లు సెమీఫైనల్స్లో ఓడిపోతే, కాంస్య పతకం కోసం జరిగే ప్లే-ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి.