12 August, 2026 | 9:21 AM

ఎస్సీ వర్గీకరణ చట్టం రద్దుకు ఉద్యమించాలి

12-08-2026 01:10 AM
  1. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి
  2. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా.వి.ఎల్.రాజు

ముషీరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయా లని, ఇందుకోసం మాలలు ఐక్యంగా ఉద్యమించాలని మాలమహానాడు జాతీయ అ ధ్యక్షులు డా. వి.ఎల్. రాజు పిలుపునిచ్చారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే మాలలకు భవిష్యత్లో బానిసత్వం త ప్పదని అన్నారు.1997 ఆగస్టు11న ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన చలో హై దరాబాద్‌సచివాలయం ముట్టడి కార్యక్రమంలో జరిగిన దాడిలో మాలమహానాడు నేతలు మృతి చెందారని డా. వి.ఎల్. రాజు గుర్తుచేశారు. మృతవీరులకు నివాళులర్పించేందుకు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మాల మృతవీరుల సంస్మరణ సభలో ఆ యన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు జె.ఎన్. రావు అధ్యక్షతన మృతవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అడ్వకేట్, దళిత బహుజన పార్టీ (డీబీపీ) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ 2024 ఆగస్టు1న సుప్రీంకోర్టు రా జ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో ఎస్సీ వ ర్గీకరణ చట్టం రూపొందించలేదని ఆరోపించారు. రోస్టర్ విధానం వల్ల మాలలకు విద్య, ఉద్యోగ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. వర్గీకరణ చట్టం రద్దు కోసం డా. వి.ఎల్. రాజు నాయకత్వంలో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

ఈ అంశంపై హైకోర్టులో విస్తృతంగా వాదనలు వినిపిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రాజలింగం, మాలమహానాడు మహిళా జాతీయ అధ్యక్షురాలు సీహెచ్. రోజా లీలా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆర్ల రమేష్, అర్షల రాజు, డీబీపీ రాష్ట్ర నాయకులు నిచ్చికోల రామ్ చందర్, పి. మోహన్ రావు, నిమ్మల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.