12 August, 2026 | 9:53 AM

పదవి కోసమే ‘జక్కిడి’ కుటుంబంపై దుష్ప్రచారం

12-08-2026 01:09 AM
  1. యూత్ కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు  శివ కుమార్
  2. ‘నకిలీ ఆడియో’లపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు 

ఎల్బీనగర్, ఆగస్టు 11 :  కొందరు నాయకులు తమ స్వార్థం, పదవుల కోసమే ‘జక్కి డి’ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు  శివ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ ఆడియో క్లిప్ లపై విచారణ చేపట్టాలని మం గళవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బుడ్డ సత్యనారాయణ చైర్మన్ పదవికోసం జక్కిడి ప్రభాకర్ రెడ్డి  కుటుంబాన్ని  బద్నా మ్ చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ఆడియోలను సృష్టించి జక్కిడి ప్రభాకర్ రెడ్డిని రాజకీయంగా అవమానపరుస్తున్న హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్  సత్యనారాయణ, అతడి అనుచరులపై చర్య తీసుకోవాలని ఏసీపీకి వినతి చేశారు. 

క్షమాపణ చెప్పాలి 

ఎరుకల కులానికి చెందిన హైదారాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్  బుడ్డా సత్యనారాయణపై కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభా కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్బీనగర్ లోని మహానీయుల విగ్రహాల మంగళవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ పలువురు నాయకులు మాట్లాడుతూ...  కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న బుడ్డ సత్యనారాయణను అదే పార్టీకి చెందిన ప్రభాకర్ రెడ్డి కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎరుకల జాతి నాయకుడిని కించపరిచేలా అవమానపరిచిన జక్కిడి ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని  డిమాండ్ చేశారు. 

కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ పీవీ రమణ, కూతటి రాములు, సిల్మర్తి శేఖర్, చర్ల రమేశ్, కండల వెంకటేశ్వర్లు, వనం గంగయ్య, శ్యామల, నందిగామ వెంకటేశ్, కోనేటి నర్సింహ, బొంగు వెంకటేశ్ గౌడ్, గాంధీ నాయక్, చందు లాల్, రమేశ్ నాయక్, గణేశ్ నాయక్, యాప్రాల్ ముఖేష్, శ్వేత, రత్నకుమారి, పావని, సాగర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.