ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
కలెక్టర్ అంకిత్ బూర్గంపాడులో వివిధ శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహణ
బూర్గంపాడు, మే 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ, వరదలు, అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు , సహాయక చర్యలపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి హరిచందన, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ (రిటైర్డ్) సుధీర్ బెల్, ఎన్డీఆర్‌ఎఫ్ (NౄRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SౄRF) ఉన్నతాధికారులతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (EOC) నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలసి పాల్గొని, బూర్గంపాడులో నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ వివిధ శాఖల అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం బూర్గంపాడు మండలంలోని అంబేద్కర్ నగర్, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి రెస్క్యూ, పునరావాస చర్యలను పరిశీలించారు.
ఫైర్ శాఖ అధికారి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్కు ఆరవ బెటాలియన్ టీజీఎస్పీకి చెందిన కే. శంకర్, సీఆర్పీఎఫ్ కమాండర్ రాజేష్ దోగ్రా అబ్జర్వర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు ఎస్సీ కాలనీ నుంచి 10 మంది గర్భిణీలు, 45 మంది చిన్నారులు సహా మొత్తం 200 మందిని, 26 పశువులను సురక్షితంగా బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశా లలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడ బాధితులకు తక్షణ వైద్య సేవలు, ఆశ్రయం, త్రాగునీరు, ఆహార సదుపాయాలు కల్పించారు. వివిధ శాఖల అధికారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మాక్ డ్రిల్ ద్వారా జిల్లా యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేసే సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, భవిష్యత్తులో సంభవించే ప్రకృతి వైపరీత్యా లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మాక్ డ్రిల్లు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. జెడ్పి సీఈవో నాగలక్ష్మి, జిల్లా వైద్య శాఖ అధికారి తుకా రాం రాథోడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి బాబురావు, బూర్గం పహాడ్ తాసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికా రులు,ఎన్ డి ఆర్ ఎఫ్,ఎస్ డి ఆర్ ఎఫ్,ఎన్ ఎన్ సి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.






