20-01-2026 05:18:07 PM
తలమడుగు,(విజయక్రాంతి): మండలంలోని దేవాపూర్ గ్రామంలో పోలీస్ శాఖ, మావల సి.ఎఫ్.ఎల్ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ రవీందర్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్ కమలాకర్, భూమన్న లు మాట్లాడుతూ... ఏపీకే పైల్స్, రివార్డ్ ఫైల్స్, ఫోన్ కు వచ్చే మెసేజ్లు, ఓటీపీలకు, ఫోన్లకు స్పందించవద్దని సూచించారు.
లక్కీ డ్రా పేరుతో, రుణాలు ఇస్తామని ఆశ చూపి లేదా డిజిటల్ అరెస్ట్ ల పేరుతో భయభ్రాంతులకు గురిచేసి సైబర్ నేరాలు అమాయక ప్రజల ఖాతాలు ఖాళీ చేస్తున్నారని అన్నారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఒకరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎలాంటి అనుమానం ఉన్న సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు సంప్రదించాలని తెలిపారు.