calender_icon.png 20 January, 2026 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కండేయ నగర్ పద్మశాలీ సంఘం అధ్యక్షుడిగా ‘దూస రఘు’ ఘన విజయం

20-01-2026 05:16:24 PM

హోరాహోరీగా సాగిన ఎన్నిక.. నరేష్‌పై 79 ఓట్ల మెజారిటీతో రఘు గెలుపు

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ భావన ఋషి సమాజ సేవా పద్మశాలీ సంఘం అధ్యక్ష ఎన్నికలు మంగళవారం సాధారణ ఎన్నికలను తలపించాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో దూస రఘు అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. మార్కండేయ నగర్ కాలనీలోని పద్మశాలీలకు మొత్తం 326 ఓట్లు ఉండగా, అధ్యక్ష స్థానానికి దూస రఘు, మద్దిరాల నరేష్ పోటీ పడ్డారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నికల అధికారులు బూర సదానందం, జిందం బాలకిషన్, మహేష్, శ్రీనివాసులు ఓటింగ్ పద్ధతిన ఎన్నిక నిర్వహించారు.

మొత్తం 326 ఓట్లకు గాను 257 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓట్ల లెక్కింపులో దూస రఘుకు 168 ఓట్లు రాగా, మద్దిరాల నరేష్‌కు 89 ఓట్లు వచ్చాయి. దీంతో 79 ఓట్ల భారీ మెజారిటీతో దూస రఘు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. రఘు గెలుపొందడంతో ఆయన మద్దతుదారులు, కాలనీ వాసులు మార్కండేయ నగర్‌లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ జయహో రఘు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రఘు తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.