16 April, 2026 | 5:57 AM

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఎదగాలి

16-12-2025 02:14 AM

రజక సంఘం డివిజన్ అధ్యక్షులు, అలిరాజ్ పేట సర్పంచ్ ఎల్లేష్ 

జగదేవపూర్, డిసెంబర్ 15: తెలంగాణ ఉద్యమ దిక్సూచి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రాజకీయాలలో ఎదగాలని రజక సంఘం గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు, అలీరాజ్ పేట సర్పంచ్ రాచమల్ల ఎల్లేష్ సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్, వార్డు సభ్యుల సన్మానంలో ఆయన మాట్లాడారు. ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో తాను ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అలిరాజపేట గ్రామస్తులు తనని ఆశీర్వదించి సర్పంచిగా గెలిపించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

నూతనంగా సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిచిన రజక కులస్తులను, జగదేవపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గణేష్ లను శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించారు. అవకాశమున్నచోట ఉపసర్పంచ్లుగా బాధ్యతలు చేపట్టాలని సంఘం సభ్యులు తీర్మానించుకున్నారు.

భవిష్యత్తులో రజక సంఘం అభివృద్ధితో పాటు రాజకీయాలలో ఒకరికొకరు సహకరించుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ రజక సంఘం అధ్యక్షులు నర్సింలు, జగదేవపూర్ మండలం గౌరవ అధ్యక్షులు అక్కారం నరసింహులు, నాయకులు వడ్లకొండ శ్రీనివాస్, కంచర్ల కుమార స్వామి, ధర్మారం లావణ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.