calender_icon.png 16 December, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ కౌన్సిల్ సభ్యుడి ప్రచారం

16-12-2025 02:15:53 AM

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 15 : బార్ కౌ న్సిల్ సభ్యుడిగా పోటీచేస్తున్న హైకోర్టు న్యా యవాది నమిలికొండ హరీష్ కుమార్ సిద్దిపేట కోర్టులో సోమవారం ప్రచారం నిర్వ హించారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి ప్ర థమ ప్రాధాన్యం ఓటు ఇవ్వాలనిసిద్దిపేట న్యాయవాదుల మద్దతుకోరారు.

న్యాయ వా దుల రక్షణ చట్టాన్ని తేవడానికి, న్యాయవాదుల ఇన్సూరెన్సు పెంపు, కోర్టులలో మౌలిక వసతులను కల్పించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు లక్ష్మీనారాయణ, కార్యదర్శి రమేష్ సంజీవరెడ్డి, కనకయ్య, రాజేశ్వర్ రెడ్డి అశోక్, అనిరుధ్ పాల్గొన్నారు