16-12-2025 02:14:46 AM
ప్రజల చేత ఎన్నుకోబడిన ఎవరైనా క్యాంపు కార్యాలయం రావచ్చు
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, డిసెంబర్ 15 (విజయక్రాంతి): ‘కావాలనే నా మాటలను అవతలి వాళ్లు వక్రీకరించి, నన్ను ట్రోల్స్ చేస్తున్నారని’ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్ట చేశారు. సోమవారం పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అయన మాట్లాడారు. కొంతమంది ప్రత్యర్థులు ఓడిపోతామనే ఉద్దేశంతో ఓట్ల కోసం తమకు సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలుసు అని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.
అలాంటి వారిని ఉద్దేశించే తాను ‘అలాంటి వాళ్లు క్యాంపు కార్యాలయంకు వస్తే కాంపౌడ్ లోపలికి కూడా రానియ్యను’ అని చెప్పానని వివరించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎవరైనా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రావచ్చని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. గతంలో ఉన్న వాళ్లు కాంగ్రెస్ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను గేటు లోపలికి రానీయలేదని, అందుకే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శించారు.