8 May, 2026 | 9:32 AM

హామీల అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలి

29-07-2025 10:19 PM

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆ పార్టీ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జాజిరెడ్డిగూడెం గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రిజర్వేషన్ల భద్రత తదితర హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకే కాకుండా అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని అన్నారు.

ఎస్సారెస్పీ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి సూర్యాపేట జిల్లా రైతులను ఆదుకోవాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ప్రజలను కూడగొట్టి ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు చెరుకు యాకలక్ష్మి,కోట గోపి,జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం,మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్,నాయకులు శిగ వెంకన్న, కొప్పోజు సరోజ,ఎల్లెంల అవిలయ్య,వజ్జె సైదయ్య,మచ్చ నర్సయ్,వజ్జె వినయ్,ఉప్పలయ్య,రవి,వీరయ్య,రాజు,వెంకన్న తదితరులు ఉన్నారు.