calender_icon.png 31 July, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయానికి వెండి తీర్థం గిన్నె బహుకరణ

29-07-2025 10:17:30 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మండల కేంద్రం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మి నరసింహాస్వామి దేవాలయా(Sri Yogananda Laxmi Narasimha Swamy Temple)నికి మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వజ్జె వీరయ్య-స్వప్న దంపతులు రూ.8వేలు విలువచేసే వెండి తీర్థం గిన్నెను మంగళవారం ఆలయ అర్చకులకు అందజేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. వారు అందజేసిన వస్తువులు నిత్య పూజా కార్యక్రమానికి ఉపయోగపడతాయని అర్చకులు అర్వపల్లి రాంబాబు అయ్యంగార్, పవనాచార్యులు తెలిపారు.