03-07-2025 12:00:00 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కోరిన బైరామల్ గూడ బస్తీవాసులు
ఎల్బీనగర్, జూలై 2 : మా ఇండ్లను కాపాడాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బుధవారం బైరామల్ గూడ చెరువు పక్కన నివాసం ఉంటున్న పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలుగా మేము అక్కడ నివాసం ఉంటున్నామని, ఇటీవల ఇండ్లను తొలిగిస్తున్నట్లు అధికారులు చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో మా ఇండ్లను కూల్చకుండా కాపాడాలని కోరారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... మీ ఇండ్ల జోలికి ఎవరూ రారని హామీ ఇచ్చారు. మీ నివాసాల ముందు గతంలో బాక్స్ డ్రైన్స్ నిర్మాణాలు పూర్తి చేశారని గుర్తు చేశారు. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, నిర్బయంగా ఉండాలని... తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి ఎవరికి నష్టం రాకుండా చూసుకునే బాధ్యత తనదని సుధీర్ రెడ్డితెలిపారు.