calender_icon.png 7 July, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి జీవితంలో గ్రాడ్యుయేషన్ ఒక మైలురాయి

03-07-2025 12:00:00 AM

మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి 

మేడ్చల్, జూలై 2 (విజయ క్రాంతి): విద్యార్థి జీవితంలో గ్రాడ్యుయేషన్ ఒక మైలురాయి వంటిదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎ మ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మైసమ్మ గూడాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ రెండవ కాన్వకేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినీ విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివిన వారికి ఫలితం ఉంటుందన్నారు. కష్టపడితే ఏదైనా సాధ్యమే అన్నారు. విద్యార్థినీ విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.