calender_icon.png 4 July, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు నమ్మకం కలిగేలా సేవలందించాలి

04-07-2025 12:13:31 AM

పెన్ పహాడ్, జూలై 3 : సర్కారు దవాఖానా అంటేనే ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్  అన్నారు. బుధవారం మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మికంగా తణిఖీ చేపట్టి ఆసుపత్రి పరిసరాలు, ఆసుపత్రిలోని పలు గదులను ఆయన పరిశీలించి సిబ్బందిపై మండిపడ్డారు.

ఒకప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన ఆసుపత్రి.. ఇప్పుడు అపరిశుభ్రతతో కొట్టుమీట్టాడం చూస్తే బాధ్యతల మీద మచ్చ పడినట్లుగా తెలుస్తుందన్నారు. ఇదే విషయంకు సంబంధించి వైద్యాధికారి స్రవంతి పై గరం అయ్యారు. తదుపరి అప్పటికే మీటింగ్ హాల్లో జరుగుతున్న ఆశాల మీటింగ్ ను డీఎంహెచ్‌ఓ హాజరై పలు అంశాలపై మీద చర్చ చేపట్టారు.

మీటింగ్లో గత నెలలో ప్రస్తావించిన అంశాలు పరిస్కారం అయ్యాయా.. లేదా.. కారణాల మీద చర్చ చేపట్టాలే తప్పా ఇలా రోజంతా తరబడి మీటింగ్ పేరుతో ఆశాల టైం వేస్ట్ చేయడం ఏంటని.. వారు ఎప్పుడు గ్రామానికి చేరుకొని సేవలు ఎప్పుడు అందించాలని డాక్టర్ స్రవంతిని ప్రశ్నించారు.

కాగా ఇప్పటికే ఆసుపత్రి నిధుల దుర్వినియోగంపై ఆరోపనలు ఎదుర్కోంటున్న హెచ్‌ఈఓ చంద్రశేఖర్ రాజు పీ హెచ్ సీ కి డీఎంహెచ్‌ఓ రాగానే కొద్ది సేపటికే బాధ్యతారహితంగా అక్కడి నుంచి జారుకోవడంపై ఆరోగ్య సిబ్బంది గుసగుసలాడుకున్నారు. కాగా వ్యాక్సినేషన్, మందుల రిజిస్టర్, హాజరు రిజిష్టర్, ప్రసవాల వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. వారి వెంట సిబ్బంది బూతరాజు శ్రీనివాస్, సైదులు, ఎల్టీ రాజు, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎంలు, ఆశాలు ఉన్నారు. |