calender_icon.png 4 July, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొట్టుకుపోయిన అప్రోచ్ రహదారి

04-07-2025 12:14:46 AM

ఐదు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

ములకలపల్లి జూలై 3 ( విజయ క్రాంతి ). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని ములకలపల్లి మండలం లో అప్రోచ్ రోడ్డు కొట్టకపోయి ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ములకలపల్లి నుంచి తాళ్లపాయ గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో ఊటవాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన అప్రోచ్ రహదారి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గురువారం తెల్లవారుజామున కొట్టుకు దీంతో అటు వైపు వెళ్లే ఐదు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి.

దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బింగిరెడ్డిపల్లి, తాళ్లపాయ, బూరుగు గుంపు,మంగలిగుట్ట, సుందర్ నగర్ గ్రామాల ప్రజలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు నిత్యం ఏ వస్తువు కావాలన్నా మండల కేంద్రమైన ములకలపల్లికి రావాల్సి ఉంటుంది.

నూతన నిర్మాణం పక్కన మట్టితో నిర్మించిన అప్రోచ్ రహదారి వర్షానికి కొట్టుకుపోవడంతో ఈ ఐదు గ్రామాలకు చెందిన ప్రజలకు మండల కేంద్రమైన ములకలపల్లి తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఈ ఐదు గ్రామాలకు చెందిన ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ అధికారులు వెంటనే అప్రోచ్ రహదారిని నిర్మించి రాకపోకలను పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.