04-07-2025 12:12:38 AM
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నర్సారెడ్డి
బూర్గంపాడు,జూలై3 (విజయక్రాంతి): కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీల వత్తాసు పలుకుతున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నర్సారెడ్డి విమర్శించారు.గురువారం మండలంలోని సారపాక సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ అనసూర్య అధ్యక్షతన సిఐటియు మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందని మండిపడ్డారు.
కార్మికుల హక్కులను కేంద్రం హరిస్తోందని దీనిని నిరసిస్తూ ఈ నెల 9న చేపట్టనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ఈ సమావేశంలో భవన నిర్మాణరంగ గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, సిఐటియు మండల కన్వీనర్ పాండవుల రామనాథం,సిఐటియు మండల కమిటీ సభ్యులు శ్రీను, కాంట్రాక్టు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.