వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి

26-09-2026 | 11:52am

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబ్‌నగర్(Mahabubnagar) నగరపాలక సంస్థ మేయర్ గుమల్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి  పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ(Chakali Ailamma) 131వ జయంతిని పురస్కరించుకుని శనివారం పద్మావతి కాలనీలోని ఆమె విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా, మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ఆర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం దొరల అన్యాయాలను ఎదిరించిన చాకలి ఐలమ్మ ధైర్యం నేటి తరానికి ఆదర్శమన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పుణికి పుచ్చుకోవాలని సూచించారు. వెనుకబడిన, పీడిత వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన బాటలో నడవాలని కోరారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు  ఉన్నారు.


మరిన్ని వార్తలు