చర్లపల్లి కారాగారంలో
08-12-2024 01:03 AM
జైల్ అదాలత్
కాప్రా, డిసెంబర్ 7: చర్లపల్లి కేంద్ర కారాగారంలో శనివారం నిర్వహించిన జైల్ అదాలత్‌లో ఖైదీలకు సంబంధించి 45 కేసులను విచారించడంతో పాటు 26 మంది ఖైదీలకు విముక్తి కల్పించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా 2వ అదనపు మెట్రోపాలిటిన్ జూనియర్ జడ్జి జే ప్రశాంతి, 9వ అదనపు మెట్రోపాలిటిన్ జడ్జి ఎస్‌ఆర్ దిలీప్‌కుమార్ నాయక్.. కేంద్ర కారాగారంలో జైలు అదాలత్‌లో పాల్గొని ఖైదీల కేసులను విచారించారు. ఈ కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ రామచంద్రం, డిప్యూటీ సూపరింటెండెంట్లు శశికాంత్, శ్రీనునాయక్, రత్నం, జైలరు పాల్గొన్నారు.




