తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక
23-05-2026 01:55 AM
ములకలపల్లి, మే 22 (విజయక్రాంతి): తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం మండల నూతన అధ్యక్షులుగా ముదిగొండ రాంబాబు,కార్యదర్శిగా మాలోత్ రావుజాతో పాటు మరో పద్దెనిమిది మందితో కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు శుక్రవారం ఇక్కడ మాట్లాడుతూ మండల వ్యాపితంగా గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల హామీ మేరకు భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని,వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కమిటి సభ్యులుగా భూక్యా సామిని,పులి వెంకటేశ్వర్లు, ముత్యాలు, కిషోర్, రవీందర్, కొసయ్య, ఇడుమ, రమేష్, పద్మ, దినేష్ ఉన్నారు.






