01-02-2026 12:41:22 AM
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి) : న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక స్వయంప్రతిపత్తి విద్యాసంస్థ విద్యా జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విజిత్)లో టెడెక్స్ విజిత్ మెటమోర్‌ఫోసిస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెం ట్ శనివారం ముగిసింది. ఇది విజిత్ క్యాంపస్‌లో నిర్వహించిన రెండో టెడెక్స్ కార్యక్ర మం కావడం విశేషం. మెటమోర్‌ఫోసిస్ అనే అంశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం మార్పు, ఎదుగుదల, సహనశక్తి వంటి భావాలను ప్రతిబింబించింది.
వివిధ వృత్తి, జీవన నేపథ్యాలకు చెందిన వక్తలు తమ అనుభవాలు, ఆలోచనలను పంచుకోవడం తో విద్యార్థులు, అధ్యాపకులు, అతిథుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ప్రసంగాలు నూతన ఆలోచనలకు, స్వీయ పరిశీలనకు, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దో హదపడ్డాయి. కార్యక్రమంలో వరెన్య బోర్బో రా, విష్ణు విజయన్, బి.కే. సుమలత, అనన్య లోహన్, శ్రీ సత్య గౌర చంద దాస్, జీత్ బసాక్, హర్షల్ మణియార్, ప్రథమేశ్ సిన్హా, ఐశ్వర్య టి.వి. పిల్లై, మేజర్ డా. మహ్మ ద్ అలీ షా వంటి ప్రముఖులు వక్తలుగా పాల్గొన్నారు.
10 సంవత్సరాల నుండి 60 సంవ త్సరాల వయస్సు వరకు గల వక్తలు పాల్గొనడం ద్వారా తరతరాల ఆలోచనల సమ్మేళ నాన్ని ఈ వేదిక ప్రతిబింబించింది. ప్రిన్సిపాల్ డా.ఎ.సృజన మాట్లాడుతూ.. ఈ కార్య క్రమం ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా పరివర్తనకు బలమైన వేదిక ఏర్పడింది. ఈ రోజు పంచుకున్న ఆలోచనలు తరగతి గదులకే పరిమితం కాకుండా, భవిష్యత్ నాయకులుగా ఎదగడంలో వారికి మార్గదర్శకంగా నిలుస్తాయి అని అన్నారు.
ఈ కార్యక్రమం విజిత్ చైర్మన్ డా. పల్లా రాజేశ్వరరెడ్డి దూరదృష్టి మార్గదర్శకత్వంలో నిర్వహించబ డింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యాసంస్థలు కేవలం అకాడమిక్ విజ్ఞానానికే పరిమితం కాకుండా, ఆలోచనలను ప్రశ్నించే, మనసులను మార్చే వేదికల ను సృష్టించాలి అన్నారు. టెడెక్స్ విజిత్ కన్వీనర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ కా ర్యక్రమం నిర్వహణ మొత్తం బృందానికి ఒక విలువైన అనుభవం.
వక్తలు, పాల్గొన్నవారి స్పందన, అర్థవంతమైన ఆలోచనలు నిజం గా మార్పును తీసుకురాగలవని నిరూపించింది అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజ యవంతం చేయడంలో డా. ఎ. పద్మజ (డీన్ అక్రెడిటేషన్స్, ర్యాంకింగ్స్), జి. శ్రీలత (డైరెక్టర్, అకాడమిక్స్), ఆర్. వెంకటాచలం (డైరె క్టర్, ప్లేస్మెంట్స్),అధ్యాపకులు, విద్యార్థులు, వలంటీర్లు కీలక పాత్ర పోషించారు.