27 April, 2026 | 4:03 AM

మకుటం కథానాయిక అంజలి

27-04-2026 02:00 AM

సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మాణంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మకుటం’. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. విశాల్, అంజలి కాంబోకి ఉన్న హిట్స్, క్రేజ్ అందరికీ తెలిసిందే.

అయితే ఈ తాజా చిత్రంలోనూ విశాల్ సరసన అంజలి నటించనున్నారు. ఈ మేరకు అంజలి, విశాల్ కలిసి ఓ కాన్సెప్ట్ వీడియోని చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని విశాల్ చూసుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.