18 April, 2026 | 3:04 AM

లారీల సమస్య లేకుండా చూడాలి

15-05-2025 01:11 AM

అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ. వెంకటేశ్వర్లు పలు రైస్ మిల్లులను తనిఖీ 

వనపర్తి, మే 14. (విజయక్రాంతి )  : కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలించేందుకు లారీల సమస్య లేకుండా చూడాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ మదనపూర్ గోదాము, ఆత్మకూరు మండలంలోని ఆరేపల్లి వరి కొనుగోలు కేంద్రం, ఆత్మకూరులో రైస్ మిల్లును  ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తూకం చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించడానికి అవసరమైన లారీలు పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొనుగోలు కేం ద్రాల్లో తూకం వేడిన వెంటనే లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా లారీలు పెట్టాలని ఆదేశించారు.   

వరి కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన వడ్లు తాలు, చెత్త లేకుండా చూసి సరైన తేమ వచ్చిన వెంటనే ధాన్యం తూకం వేయాలని, తూకం వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ఆత్మకూర్ అమర్చింత మండలాల్లో ఎక్కడ కూడా రవా ణా సమస్యలు లేకుండా రోజు 4 లారీలు పెట్టాలని ట్రాన్స్పాట్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. 

అకాల వర్షాలు కురుస్తున్నందున రైతులు తెచ్చిన వడ్లు పాడింకాకుండ  కొనుగోలు కేంద్రాలకు వచ్చిన  వడ్లపై టార్పాలిన్ కవర్లు కప్పాలని, వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఎక్కువ మంది హమాలీలను పెట్టి త్వరగా లోడ్ చేయాలనీ సెంటర్ నిర్వాహకులను ఆదే శించారు. 

అనంతరం శ్రీ లక్ష్మీ ఆగ్రోటెక్ రైస్ మిల్ ని తనిఖీ చేసారు.  మిల్లుకు వచ్చిన ధాన్యం లారీలను   త్వరగా  అన్లోడే చేసి తిరిగి పంపించాలని మిల్లర్ యజమానిని ఆదేశించారు. తాలు పేరుతో  తూకంలో అదనంగా కోతలు విధించరాదని ఆదేశించారు.  ఆత్మకూరు తహసిల్దార్ చాంద్ పాషా, ఇతర అధికారులు అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు.