calender_icon.png 29 September, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం

29-09-2025 12:55:10 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని  లబ్దిదారులకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గం లో గత మూడు నేలల్లోనే 270 మందికి రూ కోటి 70 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు సిఎం రిలీఫ్ ఫండ్ కోసం సరియైన పత్రాలను క్యాంపు కార్యా లయంలో ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, మైనారిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫయాజ్,

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజ్మత్ అలి, ఓబిసి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి మల్లేష్ యాదవ్, సోషల్ మీడియా ఇంచార్జీ ఏర్పుల నాగరాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా పాషా, రాషెద్ ఖాన్,ఉమర్, మునీర్,శంకర్, నాయకులు లీడర్ రఘు, అనుప ఆంజనేయులు, సిరిగిరి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.