calender_icon.png 29 September, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌జీజీ ఫంక్షన్‌హాల్‌లో 126వ ఎపిసోడ్ మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం

29-09-2025 12:55:40 AM

మోర్తాడ్ సెప్టెంబర్28 (విజయ క్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 126 వ ఎపిసోడ్ కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ మండల కేంద్రంలో  ఆర్ జి జి ఫంక్షన్ హాల్ లో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగాపసుపు బోర్డు జాతీయ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి,  బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి హాజరైనారు. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, నాయకులు కార్యకర్తలు, రైతులు వేల సంఖ్యలో పాల్గొని ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని హాజరై తిలకించారు. ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ పసుపు పంట, అన్ని రకాల పంటల పట్ల వివరాల గురించి మాట్లాడడం జరిగింది.