calender_icon.png 29 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 1 ర్యాంకర్ గాయత్రికి సన్మానం

29-09-2025 12:54:04 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి గాయత్రి ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా దేవునిపల్లి మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్ రావు- వినోదబాయి  దంపతులు ఆమెను శాలువాలతో ఆదివారం సత్కరించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ పద్మ, చక్రధర్ రావు పాల్గొన్నారు.