13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

చిచ్చుబుడ్డి వచ్చేసింది!

29-03-2026 12:02 AM

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్న అడివి శేష్ నుంచి రాబోతున్న తాజాచిత్రం ‘డకాయిట్’. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయిక. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ పాన్-ఇండియా యాక్షన్- రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘చిచ్చుబుడ్డి’ని విడుదల చేశారు.

ఇది శేష్ క్యారెక్టర్ సరికొత్త కోణాన్ని చూపిస్తోంది. సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేసే ఈ పాటలో అడివి శేష్ తొలిసారిగా డ్యాన్స్ చేస్తూ హై-ఎనర్జీ అవతార్‌లో అదరగొట్టారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో జానపద బాణీలతో సమకూర్చిన ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ప్రముఖ కెనడియన్ సింగర్ జోనితా గాంధీ ఈ పాటను ఆలపించడమే కాక ఇందులో డ్యాన్స్ చేయడం ద్వారా తన గ్లామర్‌ను అద్దింది. ఇంకా భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ప్రత్యేక పాత్రలో కనిపించి, అందరినీ కట్టుకునే మాస్ వైబ్‌ను నింపారు. ఈ చిత్రానికి ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జ్ఞాని నేపథ్య సంగీతం సమకూర్చారు.