14 July, 2026 | 4:50 AM

మాకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి

14-07-2026 01:50 AM

హైద్రాబాద్ జూలై 13 ( విజయ క్రాంతి): మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు చేసి హెల్త్ కార్డు ఇవ్వాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు పేర్కొన్నారు.  సోమవారం సెక్రటేరియట్‌లో సీఎస్ సంజయ్ జాజు కు వినతిపత్రం సమర్పించారు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని, ఐదు డీఏ బకాయిలను వెంటనే విడుదల చేసి చెల్లించాలనీ కోరారు.