రైతులు తక్కువ నీరు పంటలు వేసుకోవాలి
వ్యవసాయ శాఖ అధికారులు
అశ్వారావుపేట, జూలై 13 (విజయక్రాంతి): దేశంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులపట్ల రైతులు అవగాహన పెంపొందించుకొని తక్కువ నీరుతో పండించే పంటలను వేసుకోవాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ అధికారి పీ శ్రీనివాసరావు వివరించారు. సోమవారం మండల పరిధిలోని కేసప్పగూడెం, మద్దికొండ, తిరుమలకుంట గ్రామ పంచాయతీల పరిధిలోని రైతు వేదికలలో ఎల్నినో పై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలలో వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ వాతావరణ మార్పులు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల ప్రణాళిక. తక్కువ నీటితో చేయగల పంటలు, నీటి సంరక్షణ చర్యలు, సమతుల్య ఎరువుల వి నియోగం, పంటల రక్షణ చర్యలపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సతీష్, రవీంద్ర, షకీరాబాను, రైతు ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.






