14 July, 2026 | 4:26 AM

ప్రగతి బాటలో కడ్తాల్

14-07-2026 01:51 AM
  1. రూ.5.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి శంకుస్థాపన
  2. మూడు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కడ్తాల్, జులై 13 (విజయక్రాంతి): కడ్తాల్ మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా హెచ్‌ఎండిఏ, టీజీయూఐసీ, డీఏఎఫ్టీ, ఎన్‌ఆర్‌ఈజీసి నిధుల కింద మంజూరైన రూ. 5 కోట్ల 30 లక్షల విలువైన సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా ఎక్వాయిపల్లిలో రూ. 40 లక్షల పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే, పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. అనంతరం చరికొండ గ్రామాన్ని మోడల్ విలేజ్గా మార్చేందుకు రూ. 1.15 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించి, రూ. 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 5 హైమాస్ లైట్లను స్విచ్ ఆన్ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు వేగవంతంగా అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

గ్రామాల వారీగా మంజూరైన నిధుల వివరాలు:

చరికొండకు రూ. 115 లక్షలు, కడ్తాల్కు రూ. 80 లక్షలు, మైసిగండి, కొండ్రిగనుబోడులకు రూ. 50 లక్షల చొప్పున, ఎక్వాయిపల్లి, పీఆర్ కార్యాలయాలకు రూ. 40 లక్షల చొప్పున, గోవిందాయిపల్లి తండాకు రూ. 25 లక్షలు, న్యామతాపూర్, వాసుదేవ్పూర్, నార్లకుంట తండాలకు రూ. 20 లక్షల చొప్పున, NREGS ఉపాధి హామీ కింద రూ. 70 లక్షలు మంజూరయ్యాయి.కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, సర్పంచులు కరుణాకర్ గౌడ్, మహేందర్ గౌడ్,రవి, బిక్షపతి, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్,

పిసిసి నేత శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర రవికాంత్ గౌడ్, డీసీసీ నేత శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నేత అద్దాల రాములు, ఈర్లపల్లి రాములు, వెంకటేష్ సుమన్, వెంకట్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.