15 April, 2026 | 12:04 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ఉపాధి హామీ పథకాల కూలీలకు రోజు కూలి రూ.600 ఇవ్వాలి

17-02-2026 01:00 AM

అన్నపురెడ్డిపల్లి, ఫిబ్రవరి, 16 (విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ 600 వేతనం చెల్లించాలని అఖిలభారత రైతు కూలి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అన్నపురెడ్డిపల్లి మండలంలోని మర్రిగూడెం గ్రామంలో ఉపాధి కూలీల తో ఆ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్.కె ఉమర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా  గాంధీ పేరు మీద ఉండేది దానిని జి రామ్ జి పేరుతో పేరు మార్చి 125 రోజులు పనులు కల్పిస్తామని చెప్తున్నారని గతంలో మాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి  హామీ పథకం కింద రెండు వందల రోజులు కూలీలకు పని కల్పిస్తామని చట్టాలు చేశారన్నారు. 

ఆ చట్టాలను మార్చి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పేరు మార్చారని 125 రోజులు పని కల్పిస్తామని కేంద్రం మాయమాటలు చెబుతుందని ఆరోపించారు.  పథకాన్ని నీరుగార్చడానికి పనికి ప్రజలకను దూరం చేయటానికి ప్రయత్నం చేస్తుందన్నారు. విద్యుత్తు చట్టాన్ని ,విత్తన చట్టాలను తెచ్చారన్నారు. ప్రజలను కనీస రోజు కూలిని 600 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఎండాకాలంలో ఉపాధి కూలీలకు ఆర్థికంగా తోడ్పడే విధంగా ఉండేదని దీన్ని కేంద్ర ప్రభుత్వం జి రామ్ జి పేరుతో నిర్వీర్యం చేయటానికి ప్రయత్నం చేస్తుందని వెంటనే ఈ పథకాన్ని యధావిధిగా మహాత్మ  గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా పని కల్పించాలని, పాత చట్టం ప్రకారమే ఉపాధి పనులను కల్పించాలని, కూలీలకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలు జిరామిది చట్టం, విద్యుత్ చట్టం, విత్తన చట్టాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  పదం కన్నయ్య, వెంకటేశ్వర్లు రామయ్య, రాములమ్మ, లక్ష్మి, ముత్తమ్మ, రమణ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.