17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వ్యాధులతో బాధపడేవారికి చికిత్స ద్వారా సహాయం చేసేందుకు ముందుకురావాలి

04-06-2025 04:40 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): దివ్యాంగులు, మానసిక వికలత్వంతో బాధపడే చిన్నారులు, రక్తహీనత, ఇతర నరాల వ్యాధులతో బాధపడేవారికి చికిత్స ద్వారా సహాయం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్లను కోరారు. బుధవారం నల్గొండలోని కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ఈసీఐఎల్ కి చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణుబాబు, హెచ్ ఆర్ మేనేజర్ దుర్గా ప్రసాదలతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో సుమారు 52 వేల మంది విభిన్న సామర్ధ్యాలు కలిగిన వారు ఉన్నారని తెలిపారు.

ఫ్లోరైడ్ వ్యాధికి గురైన వారితో పాటు, మానసిక వికలత్వం, నరాల బలహీనత ఉన్న 700 మంది చిన్నారులు మానసిక వికలత్వంతో బాధపడుతున్న  కదలలేని పరిస్థితిలో మంచానికే పరిమితమైన వారున్నారని తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్ల తో పాటు, సీటీ స్కాన్, ఎంఆర్ స్కానింగ్ యంత్రాలు,అవసరమైన ఐ ఈ సి మెటీరియల్, చికిత్సకు సంబంధించిన సహాయాన్ని చేయాలని కోరారు. దేవరకొండ, మిర్యాలగూడ గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారని, ఇక్కడి ప్రజలు వైద్యానికై  అటవీ ప్రాంతం నుండి దేవరకొండ ,మిర్యాలగూడ, నల్గొండ లకు రావాల్సిన వస్తున్నదని,లంబాడ ,చెంచు గూడెంలలో సహాయం అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

మెడికల్ చీఫ్ ఆఫీసర్ వేణుబాబు స్పందిస్తూ సామాజిక బాధ్యత కింద దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిళ్ళు,  కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకీళ్ల వంటివి తాము పంపిణీ చేస్తున్నామని తెలిపారు.నల్గొండ జిల్లాకు 100 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు. దివ్యాంగుల అవసరాలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు రూపొందించి తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిడిపిఓ హరిత, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం ప్రోగ్రాం అధికారి నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.