06-09-2025 12:35:00 AM
-అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి
-మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
-డెన్మార్క్ రాయబారికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ప్రపంచంలో అభివృద్ధి చెందు తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉంటుం దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్ మర్యాదపూర్వకంగా భేటి అయ్యా రు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలు, తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... వాణిజ్య, పారిశ్రామిక రంగంలో రెండు దేశాల మధ్య మరింత బలపడాలని ఆకాంక్షించారు. గ్లోబల్ సిటీ గా రూపాంత రంచెందుతున్న హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ర్ట విశిష్టతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్‌కు వివరించారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో ఇక్క డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆధునిక వసతులు, ఫార్మా రంగంలో పురోగతిని గురించి చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామిక వేత్తలు తరలి వస్తున్నారని, డెన్మార్క్ లాంటి దేశం కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు.