06-09-2025 09:23:08 AM
మణికొండ (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వినాయకుని లడ్డూ వేలంలో( Vinayaka laddu auction) రికార్డ్ సృష్టించింది. బండ్లగూడ జాగీర్ లోని కీర్తి రిచ్‌మండ్ విల్లావాసులు జరిగిన వినాయక లడ్డూని వేలంలో రూ.2.31 కోట్లు చెల్లించి దక్కించుకున్నారు. ఈసారి రూ.కోటి నుంచి వేలం మొదలుపెట్టినట్లు సమాచారం. గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.1.87 కోట్లు పలికింది.